మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Krishna Tandava Stotram – శ్రీ కృష్ణ తాండవ స్తోత్రమ్
భజే వ్రజైకనందనం సమస్తపాపఖండనం
స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనమ్ |
సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
అనంగరంగసారగం నమామి సాగరం భజే || 1 ||
మనోజగర్వమోచనం విశాలఫాలలోచనం
విఘాతగోపశోభనం నమామి పద్మలోచనమ్ |
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణ వారణమ్ || 2 ||
కదంబసూనకుండలం సుచారుగండమండలం
వ్రజాంగనైక వల్లభం నమామి కృష్ణ దుర్లభమ్ |
యశోదయా సమోదయా సకోపయా దయానిధిం
హ్యులూఖలే సుదుస్సహం నమామి నందనందనమ్ || 3 ||
నవీనగోపసాగరం నవీనకేళిమందిరం
నవీన మేఘసుందరం భజే వ్రజైకమందిరమ్ |
సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం
దరాతినందబాలకః సమస్తభక్తపాలకః || 4 ||
సమస్త గోపసాగరీహ్రదం వ్రజైకమోహనం
నమామి కుంజమధ్యగం ప్రసూనబాలశోభనమ్ |
దృగంతకాంతలింగణం సహాస బాలసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవమ్ || 5 ||
గుణాకరం సుఖాకరం కృపాకరం కృపావనం
సదా సుఖైకదాయకం నమామి గోపనాయకమ్ |
సమస్త దోషశోషణం సమస్త లోకతోషణం
సమస్త దాసమానసం నమామి కృష్ణబాలకమ్ || 6 ||
సమస్త గోపనాగరీ నికామకామదాయకం
దృగంతచారుసాయకం నమామి వేణునాయకమ్ |
భవో భవావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతే కిశోరకం నమామి దుగ్ధచోరకమ్ || 7౭ ||
విముగ్ధముగ్ధగోపికా మనోజదాయకం హరిం
నమామి జంబుకాననే ప్రవృద్ధవహ్ని పాయనమ్ |
యథా తథా యథా తథా తథైవ కృష్ణ సర్వదా
మయా సదైవగీయతాం తథా కృపా విధీయతామ్ || 8 ||
ఇతి శ్రీకృష్ణతాండవ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.